బనగానపల్లె పట్టణ పరిధిలోని ప్రార్థన మందిరాలకు వచ్చే భక్తుల కోసం ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు బనగానపల్లె పట్టణ మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డి తెలిపారు. బుధవారం బనగానపల్లె పట్టణం అవుకు రహదారిలోని సాయిబాబా ఆలయంలో సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్ ను బిసి రాజారెడ్డి ప్రారంభించారు. జీత్ కుమార్ , ఎన్ శివయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.