బనగానపల్లె మండలంలోని కోటపాడు గ్రామంలో శుక్రవారం ఎనిమిది మంది వితంతువులకు ఒక్కొక్కరికి రూ.4000 చొప్పున స్పౌజ్ పెన్షన్ అందజేశారు. ఈ కార్యక్రమం గ్రామ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ చావిడి వద్ద నిర్వహించారు. ఇప్పటినుంచి వారికి నెలనెలా ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ పథకం కింద రూ.4000 అందించనున్నారు. స్థానిక నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.