బనగానపల్లె: పేదల గృహ స్వప్నం సాకారం దిశగా చర్యలు

బనగానపల్లె నియోజకవర్గంలోని అవుకు మెట్ట ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం అనువైన స్థలాన్ని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ కార్తీక్, ఆర్డీవో నరేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మార్వో నారాయణరెడ్డి తో కలిసి స్థలాన్ని సందర్శించిన మంత్రి, సుమారు 3200–3500 మంది అర్హులకు ఇళ్ల పట్టాలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. దేవాదాయ భూములకు ప్రత్యామ్నాయ భూములు కేటాయించిన తరువాత కాలనీ అభివృద్ధి చేపడతామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్