బనగానపల్లె: ఈదురుగాలులకు చెట్లు కూలి ట్రాఫిక్ అంతరాయం

బనగానపల్లె మండలంలో వాతావరణం ఒక్కసారిగా మారి భారీ ఈదురుగాలులు వీచాయి. హుసేనాపురం సమీపంలో బలమైన గాలులకు చెట్లు కూలిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న సీఐ ప్రవీణ్ కుమార్ వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో చెట్లను తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. సీఐ చొరవపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్