బనగానపల్లెలో శుక్రవారం దారుణ ఘటన జరిగింది. ఇంటి ముందే ఆడుకుంటున్న చిన్నారి మధుప్రియపై వీధికుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించిన అప్పటికే చిన్నారి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో వీధికుక్కల దాడులు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.