కోవెలకుంట్ల పట్టణంలోని వీఆర్‌ఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో బనగానపల్లె నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొని, పార్టీ బలోపేతం, బూత్ స్థాయి వ్యవస్థను పటిష్టం చేయడంపై నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సదస్సుకు జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, మండల కన్వీనర్లు, కార్యకర్తలు హాజరయ్యారు.