బనగానపల్లె సాయిబాబా ఆలయంలో దత్త జయంతికి బిసి రాజారెడ్డికి ఆహ్వానం

బనగానపల్లె పట్టణం అవుకు రహదారిలో వెలిసిన సాయిబాబా ఆలయంలో గురువారం నిర్వహించనున్న దత్త జయంతి మహోత్సవానికి పట్టణ మాజీ సర్పంచ్ బిసి రాజారెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. శ్రీ సమర్థ సద్గురు షిరిడీ సాయి సేవా సమితి వారు బిసి రాజారెడ్డిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. దత్త జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, కాకడ హారతి, పాలాభిషేకం, అన్నదానం, పల్లకి సేవ వంటివి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొని సాయిబాబాను దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ వెంకట సుబ్రహ్మణ్యం, టంగుటూరి శీనయ్య, గాదం శెట్టి వేణుగోపాల్, గుండా రవికుమార్, బచ్చు రమేష్ గుప్తా, కిరణ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్