బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలోని స్థానిక రామాలయంలో జెకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జె.ఎస్.ఎస్. బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో గౌతమ్ బుద్ధుని విశిష్టతపై గురువారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మానంద చారి మాట్లాడుతూ గౌతమ్ బుద్ధుని బోధనలు ప్రపంచానికి ఆదర్శమని, ఆయన సన్యాసత్వం స్వీకరించి ప్రపంచానికి జ్ఞానబోధ చేశారని తెలిపారు. అసత్యం ఆడరాదని, మోసం చేయరాదని, చెడు వ్యసనాల వల్ల కలిగే నష్టాలను వివరించిన బుద్ధుడు అందరికీ ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేఈ వెంకట సుబ్బయ్య, బాల హనుమంతు, కరెంటు రాజు, శ్రీనివాసులు పాల్గొన్నారు.