తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని

బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తాడేపల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, బనగానపల్లె నియోజకవర్గ సమస్యలు, పార్టీ బలోపేతంపై ఇరువురూ చర్చించారు. పార్టీ శ్రేణులు ప్రజల్లో ధైర్యంగా పనిచేయాలని జగన్ సూచించినట్లు కాటసాని రామిరెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్