బనగానపల్లె నియోజకవర్గం అవుకు పట్టణంలోని శ్రీ భూలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి దేవస్థానంలో జరిగిన రథోత్సవంలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, రథోత్సవాన్ని భక్తితో వీక్షించారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో అలరారింది.