బనగానపల్లె మండలం బీరవోలులో అనుమానంతో భార్య లక్ష్మి(35)ని భర్త వెంకటస్వామి, అతని సోదరులు కలిసి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఎస్ఆర్బీసీ కాలువ వద్ద పూడ్చిపెట్టారు. ఈ నెల 2న భార్య కనిపించడం లేదంటూ భర్తే పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణలో అసలు నిజం బయటపడింది. పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.