కొలిమిగుండ్లలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పునఃప్రతిష్ట వేడుకల సందర్భంగా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ జశ్వంత్ కుమార్‌పై మదన భూపాల్ రెడ్డి దాడికి పాల్పడ్డాడు. దీంతో 132 బిఎన్ఎస్, 121(1), 126(2), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని స్థానిక సీఐ రమేష్ బాబు గురువారం వెల్లడించారు.