నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బి. సింగవరంలో అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందడం లేదని ప్రశ్నించిన తల్లిపై దాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరిత, ఫ్రాన్సిస్ దంపతుల పిల్లలు స్థానిక అంగన్వాడీలో చదువుతున్నారు. సిబ్బంది ఇంటిపైకి వచ్చి దాడి చేశారని సరిత ఆరోపించారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం బయటపడింది.