నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కైప గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన మధుప్రియ కుక్కల దాడిలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వీధిలో మధుప్రియ ఆడుకొనుచుండగా కుక్కలు గుంపుగా ఆమెపై దాడి చేశాయి. వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శనివారం కోలుకోలేక మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. అధికారులు స్పందించి చర్య తీసుకోవాలని కోరారు.