పేదరిక నిర్మూలన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తహశీల్దార్ రమాదేవి, ఎంపీడీవో మహబూబ్ దౌల పేర్కొన్నారు. మహానంది మండల కేంద్రం తిమ్మాపురం గ్రామంలోని ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ సెక్రెటరీలు వీఆర్వోలతో పీ4 సర్వేపై సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. బంగారు కుటుంబాలకు మార్గదర్శిలు చేయూత అందించేలా అవగాహన కల్పించాలన్నారు. ఈవోఆర్డి నాగేంద్రుడు, ఎంఈఓ రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.