గోరుకల్లు నుంచి గాలేరు-నగరి వరద కాల్వ ద్వారా అవుకు జలాశయానికి 7 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలో గురువారం రాష్ట్ర మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి గండికోటకు నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. గురువారం నాటికి జలాశయంలో 1 టీఎంసీ నీటి మట్టం పెరిగే అవకాశం ఉంది.