నందవరం చౌడేశ్వరి దేవికి సహస్రదీపాలంకరణ వైభవం

బనగానపల్లె మండలం నందవరం గ్రామంలోని శ్రీ చౌడేశ్వరి దేవి క్షేత్రంలో ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి, ఛైర్మెన్ పివి నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పౌర్ణమి సందర్భంగా సహస్రదీపాలంకరణ వైభవంగా నిర్వహించారు. అర్చకులు అమ్మవారికి పూజలు చేసి, ప్రత్యేక పల్లకిలో కొలువుంచి ఉయ్యాలసేవ నిర్వహించారు. ఆలయ మాడ వీధుల్లో జరిగిన పల్లకిసేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ అలంకరణ నంద్యాల, బనగానపల్లె ప్రాంతాలలో ప్రముఖంగా జరిగింది.

సంబంధిత పోస్ట్