బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంట్ల సంతపేటలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేశారు. ప్రతి నెలా 64 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని మంత్రి పేర్కొన్నారు.