బనగానపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నందవరం శ్రీ చౌడేశ్వరీ అమ్మవారికి గ్రామస్థులు ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం చీరసారె సమర్పించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి హాజరై అమ్మవారికి చీర సారె సమర్పించారు. ఈ వేడక గ్రామంలో కన్నుల పండుగగా సాగింది. గ్రామస్థులు భారీగా తరలివచ్చారు.