ముదిగేడులో పింఛన్లు.. రూ. 30 లక్షల పనుల ప్రారంభం

బనగానపల్లె నియోజకవర్గం సంజామల మండలం ముదిగేడు గ్రామంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. గ్రామ ప్రజల సమస్యలు, మౌలిక సదుపాయాల అవసరాలపై ఆరా తీశారు. అనంతరం రూ. 30 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా రూ. 10 లక్షల సీసీ రోడ్లు, రూ. 20 లక్షల డ్రైనేజీతో కూడిన సీసీ రోడ్డును ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్