బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి సన్నిధిలో ఈనెల 15న వివిధ రకాల వస్తువుల విక్రయాలకు సంబంధించి బహిరంగ వేలాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో పాండురంగా రెడ్డి ఆదివారం తెలిపారు. ఆసక్తి కలిగిన వారు నిర్దేశించిన డిపాజిట్ చెల్లించి వేలాల్లో పాల్గొనాలని అన్నారు. మరిన్ని వివరాలకు ఈవో కార్యాలయంలో సంప్రదించాలని చెప్పారు.