అవుకు పట్టణం ముక్కమళ్ళ–అవుకు రహదారిలో రూ. కోటితో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులకు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి భూమిపూజ చేశారు. దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారంగా మురుగు నీటిని వాగులోకి తరలించే ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అవుకు మండలంలో రూ. 10 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ప్రజల సౌకర్యం కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.