బనగానపల్లెలో కానిస్టేబుల్‌పై భూపాల్ రెడ్డి దాడిని ఎస్డిపీఐ పార్టీ తీవ్రంగా ఖండించింది. నంద్యాల జిల్లా ఎస్డిపీఐ కార్యవర్గ సభ్యుడు షేక్ అబ్దుల్ కలాం శుక్రవారం మాట్లాడుతూ డ్యూటీలో ఉన్న పోలీసులపై చేయి చేసుకోవడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.