బనగానపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం శక్తి బృందం ఆధ్వర్యంలో మహిళలు, పిల్లల భద్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ప్రిన్సిపల్ రాజికా సత్యపూర్ణ అధ్యక్షత వహించారు. మహిళా స్టేషన్ సీఐ గౌతమి విద్యార్థులకు మాదకద్రవ్యాల ప్రభావం, బాల్యవివాహాలు, సైబర్ క్రైమ్ తదితర అంశాలపై సూచనలు ఇచ్చారు. విద్యార్థులు శక్తి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నారు.