డిశంబర్ 3న డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరాం బోస్ ల జయంతి, హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ వర్థంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహమ్మద్ రఫి మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధులు, శాస్త్రవేత్తలు, సమాజానికి సేవ చేసిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని కోరారు. బాబు రాజేంద్ర ప్రసాద్, ధ్యాన్ చంద్, ఖుదీరాం బోస్ ల జీవిత విశేషాలను, వారి దేశభక్తిని, సేవలను గుర్తు చేసుకున్నారు.