డోన్ లో గాంధీకి ఘన నివాళులు

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా డోన్ పట్టణంలోని గాంధీ విగ్రహానికి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ అహింసా మార్గం, త్యాగాలు దేశానికి చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆదర్శాలను జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్