బేతంచెర్ల మండలం గోరుమానుకొండలో జొన్న నాము తిన్న 40 పశువులు అస్వస్థతకు గురయ్యాయి. పశువైద్య బృందం వెంటనే స్పందించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది, అయితే ఒక పశువు మృతి చెందింది. జొన్న కోత తర్వాత పొలాల్లో మిగిలే కర్రలను పశువులు తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులు సూచించారు.