దేశ వ్యాప్త కార్మిక సమ్మె పిలుపులో భాగంగా బేతంచెర్ల మండలంలోని సీఐటీయు అనుబంధ కార్మిక సంఘాలు, ఎపిరైతుసంఘం మండల కమిటీల ఆధ్వర్యంలో బేతంచెర్ల పట్టణంలో, కేంద్ర రాష్ట్ర కార్మిక, కర్షక, ప్రజ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బేతంచెర్ల పట్టణంలో బుధవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వై ఎల్లయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వి సుబ్బరాయుడు, సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు.