డోన్‌లో వెటర్నరీ అత్యవసర సేవల కొరకు 1962కి కాల్ చేయండి

డోన్‌లో పశువులు, మేకలు, గొర్రెలకు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 1962 నంబర్‌కు కాల్ చేయాలని వెటర్నరీ ఏడీ నాగరాజు శనివారం సూచించారు. కాల్ చేసిన వెంటనే వెటర్నరీ వైద్యులు ఇంటి వద్దకే చేరుకుని చికిత్స అందిస్తారని తెలిపారు. రైతులు, పాడి పశువుల యజమానులు ఈ సేవలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సేవలు పశువుల ఆరోగ్య సంరక్షణకు అత్యంత కీలకం.

సంబంధిత పోస్ట్