డోన్‌లో ఉపాధి హామీ చట్ట పరిరక్షణకు సీపీఎం ప్రతిజ్ఞ

మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా డోన్‌లోని సీఐటీయు కార్యాలయంలో సీపీఎం ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడేందుకు ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాన్ని రద్దు చేసి, ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని సీపీఎం డిమాండ్ చేసింది.

సంబంధిత పోస్ట్