సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బేతంచర్ల మండలంలోని గుటుపల్లె గ్రామంలో ఇంటింటి ప్రచారంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు వికలాంగులు, వృద్ధులకు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.