రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద, చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించబడుతుంది. దీనివల్ల వేలాది కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, విద్యుత్ ఖర్చు తగ్గడంతో ఆదాయం పెరిగి చేనేత రంగం బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి తెలిపారు.