డోన్‌: సీఎంఆర్ఎఫ్ రూ. 35 లక్షల చెక్కుల పంపిణీ

డోన్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా భారీ ఆర్థిక సాయం అందింది. ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి కృషితో సోమవారం క్యాంప్ కార్యాలయంలో రూ. 35,97,311 విలువైన చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గత 16 నెలల్లో 543 మందికి మొత్తం రూ. 5,11,99,337 ఆర్థిక సహాయం మంజూరైందని ఎమ్మెల్యే తెలిపారు. ఆరోగ్య చికిత్సలు, అత్యవసర వైద్య అవసరాలు, ప్రమాదాల బాధితులకు ఈ సాయం ఊరటనిచ్చిందన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్