కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ప్యాపిలి మండలంలోని గుడిపాడు గ్రామంలో సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలు గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.