డోన్ యువకుడికి జాతీయ స్థాయి కబడ్డీకి అవకాశం

మచిలీపట్నంలో జరిగిన 69వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో ఉమ్మడి కర్నూలు జట్టు ప్రథమ స్థానం సాధించింది. డోన్ జెడ్పీహెచ్ఎస్ పాతపేటకు చెందిన బి. వెంకటేష్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జట్టుకు విజయం సాధించిపెట్టాడు. ఈ విజయంతో వెంకటేష్ డిసెంబర్లో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మావతమ్మ, వ్యాయామ ఉపాధ్యాయులు అతన్ని ఘనంగా సన్మానించారు. తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆయన విజయాన్ని శుభాకాంక్షలతో అభినందించారు.

సంబంధిత పోస్ట్