డోన్: వడ్డే ఓబన్న జయంతి వేడుకలు ఘనంగా

స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షులు, అఖిలభారత వడ్డెర సంఘం రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి చల్లా అనుదీప్ కుమార్ పాల్గొన్నారు. వడ్డెర సంఘం నాయకులు, కార్యకర్తలు ఓబన్న త్యాగాలను స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్