డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో, కొత్తబూర్జు రైతులకు ప్రభుత్వం గురువారం 80% సబ్సిడీతో రూ. 10 లక్షల విలువైన వ్యవసాయ డ్రోన్ ను పంపిణీ చేసింది. డ్రోన్ పనితీరును పరిశీలించిన ఎమ్మెల్యే, రైతులు కొత్త టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు.