బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలి: మహమ్మద్ రఫి

జూన్ 12 - బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి మాట్లాడుతూ, బాలలను బడిలో చేర్పించకపోతే దేశం అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు. బాల కార్మికులను గుర్తిస్తే వెంటనే 1098 చైల్డ్ లైన్‌కు సమాచారం అందించాలని ఆయన కోరారు. బాల కార్మికుల దుస్థితిని వెలుగులోకి తెచ్చి, వారిని బడిలో చేర్పించే ప్రయత్నమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడానికి ప్రజలందరూ సామాజికంగా తమ వంతు కృషి చేయాలని, 1098కు ఫోన్ చేసి చిన్నారులకు మంచి భవిష్యత్తును అందించాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్