బేతంచర్లలో రైతులకు పాసుబుక్కులపై అవగాహన

శుక్రవారం బేతంచర్ల మండలంలోని గొర్లగుట్ట, అంబాపురం గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. నూతన పట్టాదారు పాసుపుస్తకాలు పూర్తిగా పారదర్శకంగా, ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్‌తో రూపొందించామని తెలిపారు. రీ-సర్వే పూర్తైన గ్రామాల్లో రైతులకు గ్రామ సభల ద్వారా పాసుబుక్కులు అందజేస్తామని, భూమి హక్కుల రక్షణే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్