గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి, యూనియన్ నేతల సంతాపం

డోన్ మండలంలోని ఉడుములపాడు గ్రామానికి చెందిన 41 ఏళ్ల లారీ డ్రైవర్ యు. కృష్ణ మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఈ సందర్భంగా డోన్ మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఏవి. భాస్కర్ రెడ్డి, టి. శివరాం, గ్రామ మాజీ సర్పంచ్ ఆదినారాయణ మృతుని భౌతిక కాయానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. కృష్ణ ఆకాల మరణం కుటుంబానికి తీరని లోటని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్