భారీ చోరీ కేసు చేధింపు

నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఐటీసీ సిగరెట్ గోదాంలో ఏప్రిల్ 20న జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించి, అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ముగ్గురు నిందితులను బుధవారం రుద్రాక్ష గుట్ట సమీపంలోఅరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.14,01,500 నగదు, చోరీకి వినియోగించిన కారు, 45 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరు రాజస్థాన్‌కు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు. చోరీ చేసిన సిగరెట్ కార్టన్లను హైదరాబాద్‌లో విక్రయించి వచ్చిన నగదును తమ వద్ద ఉంచుకున్నట్లు వెల్లడించారు. అలాగే కడపలో కూడా ఇదే తరహా పలు చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు.

సంబంధిత పోస్ట్