డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి మండలం రాచర్ల గ్రామ సమీపంలో వెలసిన శ్రీ కంబగిరి స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, యువ నాయకులు కోట్ల రాఘవేంద్ర రెడ్డి మంగళవారం హాజరయ్యారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధికి, ప్రజల సౌకర్యం కోసం కృషి చేస్తామని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి తెలిపారు.