ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 9న డోన్ మండలం కొత్తబుర్జు గ్రామంలో పట్టాదారుల పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి సభ స్థలం, హెలిప్యాడ్ ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. వేదిక, భద్రత, రవాణా, తాగునీరు, పార్కింగ్ తదితర అంశాలపై సమీక్షించి, రైతులు భారీగా హాజరయ్యే అవకాశం ఉన్నందున ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.