డోన్ పట్టణంలోని శ్రీ శిరిడి సాయి విద్యానికేతన్ స్కూల్ లో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో, హెచ్ఎం కె. సురేష్ అధ్యక్షతన 'స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్' పై అవగాహన సదస్సు మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, మొక్కలు నాటడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రతి నెలా మూడవ శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో, ప్లాస్టిక్ రహిత జీవనశైలిని అవలంబించాలని, వాతావరణ కాలుష్యాన్ని నివారించాలని మహమ్మద్ రఫి పిలుపునిచ్చారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతో పాటు దోమల నివారణ, విష జ్వరాల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు. నీటి వృధాను అరికట్టి, ఓజోన్ పొరను రక్షించుకోవాలని సూచించారు.