బేతంచెర్ల పట్టణం హనుమాన్ నగర్ కాలనీకి చెందిన ప్రమీల, ఆమె ఇద్దరు పిల్లలు దర్శన, ప్రభుదేవ శుక్రవారం నుంచి కనిపించకుండా పోయారు. ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. భర్త ప్రశాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమాచారం తెలిసినవారు పోలీసులకు తెలియజేయాలని కోరారు.