మంగళవారం ప్యాపిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గ్రామ, వార్డ్ సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ప్రజా సేవలను సమయానికి, నిబద్ధతతో అందించాలని, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో సచివాలయాలు కీలకమని, మర్యాదపూర్వక సేవ ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.