డోన్‌లో రేపు విద్యుత్ అంతరాయం: ఏఈ

డోన్ 1వ ఫీడర్ పరిధిలోని 11 కేవీ లైన్ మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగేంద్ర, ఏఈ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. మహాలక్ష్మి హాస్పిటల్, పండరీనగర్, శ్రీకృష్ణ నగర్, కురుకుందు కాలనీ, శ్రీరామటాకీస్, కేవీఎస్ హాస్పిటల్, గర్ల్స్ హైస్కూల్, పాతపేట, చాకిరేవు మిట్ట ప్రాంతాలు ప్రభావితమవనున్నాయి. మరమ్మతులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్