డోన్ మండలంలోని పలు జడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లో ఎస్ఏ హిందీ ఉపాధ్యాయుల పోస్టులు దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్నాయని ఎంఈఓ ప్రభాకర్ బుధవారం తెలిపారు. గుమ్మకొండ, ఎద్దుపెంట, చనుగొండ్ల పాఠశాలల్లో హిందీ బోధనకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు వెంటనే డోన్ ఎంఈఓ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.