స్వాతంత్ర్య సమరయోధుల సేవలు చిరస్మరణీయం: మహమ్మద్ రఫి

జూలై 07న స్వాతంత్ర్య సమరయోధులు కళా వెంకటరావు గారి వర్థంతి సందర్భంగా, డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మహమ్మద్ రఫి మాట్లాడుతూ, దేశం కోసం స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి త్యాగాలను గుర్తు చేసుకుని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని, దేశాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. స్వాతంత్ర్య సమరయోధులు, శాస్త్రవేత్తలు, మహనీయుల అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్