కోడుమూరు ఆసుపత్రిలో 4 కిలోల శిశువు జననం

కోడుమూరు పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గీత అనే మహిళ 4 కిలోల బరువున్న ఆడశిశువుకు సోమవారం సాధారణ ప్రసవం ద్వారా జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యాధికారి డాక్టర్ బి. నాగరాజు తెలిపారు. ఇటీవల లింగాలపల్లికి చెందిన లలిత కూడా 4 కిలోల మగశిశువుకు సాధారణ ప్రసవం ద్వారా జన్మనిచ్చినట్లు ఆయన వెల్లడించారు. సాధారణ ప్రసవాలకు వైద్యులు, సిబ్బంది అందిస్తున్న సేవలను కుటుంబ సభ్యులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్